BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం, పాకిస్తాన్ ఏం చెప్పిందంటే..
భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమ మ్యాచ్‌లను భారత్‌నుంచి తరలించి, సహాతిథ్య దేశమైన శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే ఈ వారం ప్రారంభంలో ఐసీసీ బంగ్లా అభ్యర్థనను తిరస్కరించింది. తుదిగా బంగ్లాదేశ్‌కు 24 గంటల సమయం ఇచ్చింది. ఆ గడువు తీరిపోవడంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ: ఇక వాహనం కొన్న షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్.. అదనంగా చార్జీలు ఏమైనా చెల్లించాలా?
షోరూమ్‌లో డీలరు తరఫున వాహనానికి సంబంధించి ఫామ్ 21(సేల్స్ సర్టిఫికెట్), ఫామ్ 22(రోడ్ వర్తీనెస్ సర్టిఫికెట్), ఇన్సూరెన్స్, వాహన కొనుగోలుదారుడి చిరునామా ధ్రువీకరణపత్రం, వాహనం ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఈ పత్రాలను డీలరు నుంచి నేరుగా ఆర్టీఏ కార్యాలయాల్లో సమర్పించాలని అధికారులు చెబుతున్నారు.
క్రికెట్: నీళ్లు తాగడానికి క్రీజు వీడితే రనౌట్ అయ్యాడు
బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 81 పరుగుల వద్ద తన 28వ ఫస్ట్ క్లాస్ సెంచరీకి చేరువలో ఉండగా, విచిత్రమైన రనౌట్ రూపంలో వెనుతిరిగాడు.
వీధి కుక్కలే లేని దేశంగా నెదర్లాండ్స్ ఎలా నిలిచింది, ఈ సమస్యను కొన్ని దేశాలు ఎలా పరిష్కరించుకున్నాయి?
యానిమల్ వెల్ఫేర్ యాక్ట్-2013 కింద, డచ్ ప్రభుత్వం జంతువులను భావోద్వేగాలున్న జీవులుగా గుర్తించింది. ఈ చట్టం ప్రకారం, జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే భారీ జరిమానాలతో (సుమారు 15 లక్షల రూపాయలు) పాటు జైలు శిక్ష విధిస్తారు. వీధికుక్కల నియంత్రణ కోసం సీఎన్‌వీఆర్ అనే పద్ధతిని అమలు చేసింది
టీ20 వరల్డ్ కప్: ఇందులో ఆడకపోతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు ఎంత నష్టం వస్తుందంటే...
చాలావరకు క్రికెట్ బోర్డులు, క్రికెటర్లకు ఐసీసీ టోర్నీలే ప్రధాన ఆదాయ వనరు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఆడకపోతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ క్రికెటర్లు, సంబంధిత వ్యక్తులందరూ ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.
కొంగలా ఒంటికాలిపై నిల్చోవడం ప్రాక్టీస్ చేస్తే ముసలితనంలో తూలి పడిపోయే సమస్యలు తగ్గుతాయంటున్న నిపుణులు, ఇంకా ఏం చెప్పారంటే..
మనుషులు కొంగల్లా ఒంటికాలిపై ఎక్కువ సేపు నిల్చోగలరా? అలా నిల్చోగలగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా గుర్తించొచ్చు. ఒక్క కాలిపై నిల్చునే వ్యాయామం రోజూ కొంత సేపు చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు. వయసుకు, ఒకే కాలిపై నిల్చునే వ్యాయామానికి ఉన్న సంబంధమేంటి?
గ్రీన్లాండ్ విషయంలో అమెరికా పోకడ చైనా, రష్యాలకు లాభమా?
గ్రీన్‌లాండ్‌ను ఒకప్పుడు డెన్మార్క్‌కు అమెరికా ఇచ్చిన బహుమతిగా డోనల్డ్ ట్రంప్ అభివర్ణిస్తున్నారు. అమెరికా 'ఏదో ఒక విధంగా దాన్ని తిరిగి తీసుకుంటుంది' అనే ఆయన పట్టుదల యుక్రెయిన్ పట్ల పుతిన్ ఉపయోగిస్తున్న భాషలాగా ఉంది.
బోర్డ్ ఆఫ్ పీస్: ఐక్యరాజ్య సమితిని బలహీనపరిచేందుకు ట్రంప్ దీన్ని తీసుకొస్తున్నారా?
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన "బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి బోర్డు)"ను ఆవిష్కరించారు. ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరాలని పదులకొద్దీ ప్రపంచ నేతలకు లేఖలు అందినట్లు పలు కథనాలు చెబుతున్నాయి. మరి ఆ దేశాలు ఏమంటున్నాయి?
బోరాక్స్: క్యారమ్ బోర్డు మీద వాడే ఈ పౌడర్‌ను తిని బరువు తగ్గాలనుకున్న విద్యార్థిని మృతి, అసలేంటి ఈ బోరాక్స్, ప్రాణం తీసేంత ప్రమాదమా?
యూట్యూబ్ చానల్లో వీడియో చూసిన తర్వాతనే కలైయరసి బోరాక్స్‌ను కొనుగోలు చేసి, తిన్నట్లు పోలీసులు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
భూతకోల: ఏమిటీ ఆచారం, బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా?
బయటివారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు?
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.

























































