You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
భారత్ - పాకిస్తాన్ యుద్ధాల్లో ఇరాన్ ఎవరికి మద్దతిచ్చింది? కశ్మీర్ అంశంలో ఏం జరిగింది?
1950 మార్చి 15న ఇండియా - ఇరాన్ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అయితే, భారత్ - పాకిస్తాన్ యుద్ధాల్లో ఇరాన్ ఎవరికి సాయం చేసింది? ఆ తర్వాతి దశాబ్దాల్లో ఏం జరిగింది? ఇరుదేశాల సంబంధాల గురించి చరిత్ర పుటల్లో ఏముంది?
ట్రంప్ సుంకాలు విధించినా భారీగా పెరిగిన చైనా ఎగుమతులు
జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎగుమతులు 20 శాతానికి పైగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు చూపుతున్నాయి. ఇది ఆర్థిక నిపుణులు అంచనా వేసిన వృద్ధి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
వీడియో, రెస్ట్ తీసుకుంటూ డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి, వ్యవధి 2,20
పెద్దపులి హాయిగా సేదతీరుతున్న ఈ దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డ్రోన్ కెమెరాకు చిక్కాయి. పాపికొండల అభయారణ్యంలో ఈ వీడియోను చిత్రీకరించారు.
గ్యాస్ బుకింగ్: 25 రోజుల తరువాతే రెండో సిలిండర్.. కేంద్రం కొత్త నిబంధనలు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిల్వలను అరికట్టడానికి గ్యాస్ సిలిండర్ బుకింగ్ నియమాలను మారుస్తూ నిత్యావసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించింది. మరోవైపు, గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది.
మీ పేరు, నంబర్, అడ్రస్ ఆన్లైన్లో అమ్మేస్తున్నారని మీకు తెలుసా? ఈ ప్రైవసీ టూల్ మీకు సాయపడవచ్చు..
మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇతర సమాచారాన్ని అనేక కంపెనీలు ఆన్లైన్లో అమ్మేస్తున్నాయని మీకు తెలుసా? ఇలా విక్రయిస్తున్న వారిలో టెలీమార్కెటర్లు, ఈర్ష్యతో రగిలిపోతున్న మీ మాజీ భాగస్వాములు, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేవారు ఉండవచ్చు. అయితే, ఇలాంటి సున్నితమైన సమాచారం ఇతరులకు దొరకడాన్ని కష్టతరం చేసే ఒక టూల్ ఉంది. అదేంటంటే..
సౌదీ అరేబియా కోసం పాకిస్తాన్ తన మిత్రదేశమైన ఇరాన్‌కు ఎదురు తిరుగుతుందా?
సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందముంది. దాని ప్రకారం, ఈ రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండో దేశంపై కూడా చేసినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో, సౌదీకి మద్దతుగా పాకిస్తాన్ పొరుగు దేశమైన ఇరాన్‌పై యుద్ధానికి దిగుతుందా?
ఇరాన్ ఇజ్రాయెల్ కంటే గల్ఫ్ దేశాలపైనే ఎక్కువ క్షిపణులు ప్రయోగిస్తోందా?
ఇరాన్ రక్షణ సామర్థ్యాల్లో బాలిస్టిక్, క్రూయిజ్, హైపర్సోనిక్ క్షిపణులు ఉన్నాయి. అలాగే, డ్రోన్లు కూడా ఈ దేశంలో ఉన్నాయి. అయితే, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో దాడులకు తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
‘అతిగా ఆలోచించడం మానేశాను’.. ఇషాన్ కిషన్ రెండేళ్లు జట్టుకు దూరమవడంపై ఎందుకలా అన్నాడు?
"విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ని సంవత్సరాలుగా అతను తన ఎనర్జీని వినియోగించుకున్న తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. నాలో నేను ఎలాంటి మార్పులు చేసుకోవాలనేది అర్థం చేసుకోవడానికి అది సాయపడింది" అని ఇషాన్ వివరించాడు.
వీడియో, రామసుబ్బమ్మ వయసు 80, కానీ రన్నింగ్‌లో 32 గోల్డ్, 14 సిల్వర్ ఎలా గెలిచారో చూడండి.., వ్యవధి 2,58
నెల్లూరు జిల్లా కావలికి చెందిన రామసుబ్బమ్మ... ఇప్పటికీ పిల్లలతో పోటీ పడి మరీ ట్రాక్ మీద దూసుకెళ్తున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.