‘భారత్‌లోని జనావాసాలపై పాక్ కాల్పులు’..విధ్వంసం 10 చిత్రాలలో 10 మే 2025
చదివే సమయం: 3 నిమిషాలు
జమ్మూలోని జానీపూర్ కాలనీలో ఉదయం 6 గంటలకు తమ ఇంటిపై దాడి జరిగినప్పుడు నిద్రపోతున్నామని ఒక తల్లి, కూతురు బీబీసీ ప్రతినిధి దివ్యా ఆర్యకు చెప్పారు.
''ఇల్లంతా పొగ అలుముకుంది. మాకేం కనిపించలేదు. ఒట్టికాళ్లతో కిందకి దిగినప్పుడు, కిందనున్న వస్తువులతో కాళ్లు కాలాయి. తలుపు తెరిచేందుకు చాలా సమయం పట్టింది. ఎలాగో మేం తప్పించుకోగలిగాం'' అని తాన్యా తల్వార్ చెప్పారు.
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, షెల్లింగ్ భయంతో కశ్మీర్‌లోని ఉరీ పట్టణం నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. ఫొటో సోర్స్, NARINDER NANU/AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, అమృత్‌సర్ శివారులో ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిన డ్రోన్ ఫొటో సోర్స్, NARINDER NANU/AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఘర్షణలు పెరగడంతో, అమృత్‌సర్ సమీపంలో తమ గ్రామాన్ని వీడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న మహిళ ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, శ్రీనగర్ నుంచి 125 కి.మీల దూరంలో ఉన్న కల్గి గ్రామంలో పాకిస్తాన్ ఫిరంగి దాడికి ధ్వంసమైన ఇల్లు ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, సరిహద్దులో ఉద్రిక్తతలతో భారీ కాల్పులు, షెల్లింగ్‌తో ధ్వంసమైన ఇంటిని చూసి బాధపడుతున్న మహిళలు ఫొటో సోర్స్, Yawar Nazir/Getty Images
ఫొటో క్యాప్షన్, నియంత్రణ రేఖకు సమీపంలోని ఉరిలో పాకిస్తాన్ బలగాలు చేపట్టిన ఫిరంగి దాడుల్లో ధ్వంసమైన తన ఇంటిని చూపిస్తోన్న ఓ వ్యక్తి ఫొటో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ దాడుల్లో ధ్వంసమైన ఇల్లు పైభాగం ఫొటో సోర్స్, Yawar Nazir/Getty Images
ఫొటో క్యాప్షన్, ఉరీ పట్టణంలో పాకిస్తాన్ దళాలు జరిపిన ఫిరంగి దాడుల్లో ఒక నివాస గృహం లోపల పూర్తిగా ధ్వంసమైంది. ఫొటో సోర్స్, Muzamil Mattoo/NurPhoto via Getty Images
ఫొటో క్యాప్షన్, శ్రీనగర్‌కు ఉత్తరాన ఉన్న ఉరీ పట్ణణంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు (బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)