You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బొమ్మనే అమ్మ అనుకుంటోందా? జపాన్ జూలోని ఈ కోతిపిల్ల వీడియో ఎలా వైరల్ అయ్యిందంటే..
జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో ఉండే ఈ కోతి పిల్లకు జూ సిబ్బంది పెట్టిన పేరు పంచ్.
కారణమేంటో తెలియదుగానీ, పుట్టిన కొన్నాళ్లకే దీనిని తల్లి పక్కబెట్టటం మొదలుపెట్టింది.
దీంతో ఆ కోతి పిల్ల ఒంటరిదయింది. గుంపులోని మిగిలిన కోతి పిల్లలకూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
దీంతో సిబ్బంది దానికి ఒక ఒరంగుటాన్ బొమ్మను ఇచ్చారు. ఆ బొమ్మనే తల్లి అనుకుందో, లేదంటే బొమ్మగానే ఆడుకుంటోగానీ, ఆ బొమ్మతో అది ఆడే ఆటలను చూపరులు ఆసక్తిగా చూస్తున్నారు. వైరలైన ఈ వీడియో ఆన్‌లైన్‌లో లక్షలమంది నెటిజన్ల హృదయాలను కదిలించింది.
ఈ పిల్ల కోతి ఆ బొమ్మలోనే తన తల్లిని చూసుకుంటోందంటూ చాలామంది వ్యాఖ్యానించారు.
అయితే, ఇప్పుడిప్పుడే పంచ్‌ను తమ గుంపులో ఒకరిగా చూస్తున్నాయి పెద్ద కోతులు.
మకాక్ కోతుల్లో సామాజిక బంధాలకు ప్రతీకగా భావించే ‘గ్రూమింగ్' (శరీరంపై ఉండే రోమాలను సరిచేయడం)ను ఈ కోతిపిల్లకు మిగిలిన కోతులు చేయడం కనిపించింది.
అంటే, క్రమంగా ఈ పిల్లకోతి పెద్ద కోతుల్లో కలిసిపోతోందన్నమాట.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)