గుజరాత్ - హిమాచల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, Getty Images
పార్టీల్లో ఉత్కంఠ. నేతల్లో టెన్షన్. జనంలో ఆసక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా గుజరాత్ ఎన్నికల ఫలితాల ఫీవర్ పట్టుకుంది.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడబోతున్నాయి. విజయంపై కమలనాథులు, కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
తొలి విడత 89 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, 68 శాతం ఓటింగ్ నమోదైంది.
తుది దశలో 14 జిల్లాల్లోని 93 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది.
92 స్థానాల్లో గెలిచిన పాటీ అధికారం దక్కించుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, గుజరాత్‌లో నిజంగా గెలిచేదెవరు? దీనిపై కొన్ని వార్తా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి.
వేర్వేరు సంస్థలు నిర్వహించిన 'పోల్స్'లో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తానికి గుజరాత్ ఎన్నికలకు సంబంధించి.. బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
ఒక్క ఏబీపీ తప్ప తక్కినవన్నీ బీజేపీకి 100కు పైగా సీట్లు వస్తాయని వివరించాయి.
ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో చూడండి.

హిమాచల్ ప్రదేశ్‌లో్నూ బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
ఇక్కడ మెజారిటీకి 35 సీట్లు అవసరం.
అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 40కిపైగా సీట్లు వస్తాయని తెలిపాయి.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








