వీవీప్యాట్‌ల లెక్కింపుపై విపక్షాల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
50 శాతం ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని కోరుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ సహా 21 విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఒకే అంశంపై తాము ఎన్నిసార్లు విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఈ అభ్యర్థనపై ఇంతకుముందు ప్రకటించిన నిర్ణయాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని న్యాయస్థానం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ 21 విపక్షాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై కోర్టు మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- మోదీ 200 టన్నుల బంగారాన్ని విదేశాలకు తరలించారా...
- సోషల్ మీడియాలో వలవేసి.. ఇండియాలో అమ్మేస్తున్నారు
- సీజేఐ రంజన్ గొగోయ్ లైంగికంగా వేధించారన్న ఆరోపణలు నిరాధారం: త్రిసభ్య కమిటీ
- ‘నా పోరాటం దేశం కోసం.. వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాల్సిందే’ : చంద్రబాబు
- కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్.. ఏర్పాట్లు మొదలైపోతున్నాయ్
- ఎటు నుంచి ఏ తూటా వచ్చి ప్రాణం తీస్తుందో.. ఏ బాంబు భస్మీపటలం చేస్తుందో
- 99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు
- నమ్మకాలు-నిజాలు: పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా, కాదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





