భోపాల్ విషాదానికి 35 ఏళ్లు... ఫోటోలు చెప్పే విషాద చరిత

యూనియన్ కార్బయిడ్ రసాయనాల కర్మాగారం నుంచి వ్యాపించిన టన్నుల కొద్ది విష వాయువులకు భోపాల్ నగరంలోని ప్రజలు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషాద చరిత్రకు నేటితో 35 ఏళ్ళు,

విషవాయువులు విడుదలైన 24 గంటల్లోనే 3 వేల మందికి పైగా చనిపోయారని అంచనా. ఆ తరువాత మరి కొన్ని వేల మంది ఆ విషపు గాలులకు, అనంతర పరిణామాలకు బలయ్యారు. అది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక విధ్వంసం.

బతికి ఉన్న వాళ్ళలో కూడా వేలాది మంది ఆ ప్రభావానికి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు లోనయ్యారు. జీవితాంతం వెంటాడే వైకల్యాలను భరించారు.

ఆ రసాయన కర్మాగారం అవశేషాల చీకటి నీడల్లో చితికిపోయిన జీవితాలను ఫోటోగ్రాఫర్ జుడా పాసోవ్ తన కెమేరాలో బంధించారు.

ఇవీ చరిత్ర మరువని విషాదానికి చెరగని సాక్ష్యాలు.

అన్ని ఫోటోలు: జుడా పాసోవ్

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)