పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం

చదివే సమయం: 1 నిమిషాలు

పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని మోదీ ప్రభుత్వం తగ్గించింది.

దీంతో లీటర్ పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై పది రూపాయలు తగ్గనుంది.

తగ్గించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి, వినియోగదారులకు ఊరట కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

దీపావళి సందర్భంగా ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇటీవల నెలల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయని, దాంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

అన్ని రకాల ఇంధన కొరతను ప్రపంచం ఎదుర్కొందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్‌ మీద ఎక్సైజ్ సుంకం రెట్టింపు తగ్గించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని కేంద్రం అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)