ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో లోపం, 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ మీద చిక్కుకుపోయిన కాన్వాయ్

ప్రధానికి భద్రత కల్పించే సిబ్బంది మధ్య సమన్వయ లోపం

ఫొటో సోర్స్, ANI

చదివే సమయం: 3 నిమిషాలు

భద్రతా ఏర్పాట్లలో లోపాల వల్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లో జరిగే ర్యాలీకి వెళ్లలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది.

"హుసేనీవాలాలోని అమరవీరుల స్మారకానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన మంత్రి కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ మీదకు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు ఆ మార్గాన్ని జామ్ చేసినట్లు తెలిసింది. దాంతో ప్రధాని ఆ ఫ్లైఓవర్ మీదే 15 నుంచి 20 నిమిషాలు చిక్కుకుపోయారు. ప్రధాని మోదీకి చేసిన భద్రతా ఏర్పాట్లలో ఇది ఒక పెద్ద లోపం" అని హోంమంత్రిత్వ శాఖ చెప్పింది.

వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం, ఈ భారీ భద్రతా లోపం కారణంగా ప్రధాని మోదీ కాన్వాయ్ తిరిగి భటిండా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించింది.

అయితే, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, పంజాబ్ ప్రభుత్వం నుంచి దీనిపై నివేదిక కోరామని కేంద్ర హోం శాఖ చెప్పింది.

తిరిగి భటిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని అక్కడి అధికారులతో "నేను ప్రాణాలతో తిరిగి భటిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నందుకు, మీ ముఖ్యమంత్రికి థాంక్స్ చెప్పండి" అన్నారని విమానాశ్రయంలోని అధికారులు చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

ప్రధాని మోదీ భద్రత

ఫొటో సోర్స్, ANI

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ప్రధాని మోదీ కార్యక్రమానికి అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేశారని పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాఆరోపణలు చేసినట్లు పీటీఐ పేర్కొంది.

"ప్రధాన మంత్రి కాన్వాయ్ వచ్చే దారిలో ఎలాంటి సమస్యలూ లేకుండా చూస్తామని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎస్‌పీజీ భరోసా ఇచ్చారు. కానీ, నిరసనకారులను ప్రధాని మోదీ మార్గంలోకి వచ్చేలా చేశారు. ఇది తీవ్రమైన భద్రతా లోపం" అని నడ్డా అన్నారు.

"పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఈ విషయం గురించి కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. ప్రధాని ర్యాలీకి వెళ్లకుండా జనాలను అడ్డుకోవాలని పంజాబ్ పోలీసులకు ఆదేశాలు కూడా ఉన్నాయి" అని నడ్డా ఆరోపించారు.

ప్రధాని మోదీ భద్రత

ఫొటో సోర్స్, ANI

ప్రధాని మోదీ భద్రతలో ఎలాంటి లోపం లేదు, ఖాళీ కుర్చీలు చూసి ర్యాలీకి వెళ్లలేదు: కాంగ్రెస్

జేపీ నడ్డా చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

1) ప్రధాని ర్యాలీకి భద్రత కల్పించేందుకు 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

2) ఎస్పీజీతో పాటు ఇతర ఏజెన్సీల సహకారంతో అన్ని రకాలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

3) హరియాణా-రాజస్థాన్ నుంచి వచ్చే బీజేపీ కార్యకర్తలకు బస్సులను కూడా మరో మార్గంలో పంపించారు.

4) రోడ్డు మార్గంలో హుస్సేనివాలాకు వెళ్లాలని ప్రధాని నిర్ణయించారు. ఇది ప్రధాని కాన్వాయ్ వెళ్లేందుకు ముందుగా నిర్ణయించిన మార్గం కాదు.

5) ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పర్యటనకు వ్యతిరేకంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నిరంతరం నిరసన తెలుతూనే ఉంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రైతు సంఘం నేతలు రెండు దఫాలుగా చర్చలు జరిపారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా

"ప్రియమైన నడ్డా జీ, ర్యాలీ రద్దుకు కారణం ఖాళీ కుర్చీలే. మీరు నేను చెప్పేది నమ్మకపోతే, ఒకసారి చూడండి.'' అంటూ సూర్జేవాలా ఓ వీడియోను ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కెప్టెన్ అమరీందర్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో...

ప్రధాని చేరుకోలేకపోయిన ఫిరోజ్‌పూర్ ర్యాలీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హాజరయ్యారు.

ప్రధాని నరేంద్ర మోదీ సభకు రాకుండా తిరిగి వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ప్రధాని మోదీకి సరైన భద్రతా ఏర్పాట్లు కల్పించకపోవడంపై ఆయన ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ లక్ష్యంగా ఒక ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"పంజాబ్‌లో శాంతిభద్రతల పూర్తిగా విఫలమయ్యాయి. ముఖ్యంగా ఇది ముఖ్యమంత్రి, పంజాబ్ హోంమంత్రి వైఫల్యం. మీరు దేశ ప్రధానికి, అది కూడా ఆయన పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో సురక్షితమైన మార్గాన్ని అందించలేనప్పుడు.. అధికారంలో ఉండడానికి మీకు ఎలాంటి హక్కూ లేదు. మీరు తప్పుకోవాలి" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)