అసదుద్దీన్ ఒవైసీ: ‘యూపీ నుంచి దిల్లీ వెళ్తుంటే నా కారుపై కాల్పులు జరిపారు’

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Twitter.com/aimim_national

చదివే సమయం: 3 నిమిషాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి దిల్లీకి వెళుతున్న దారిలో ఒక టోల్ ప్లాజా వద్ద తన కారుపై కాల్పులు జరిపారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

"కొద్దిసేపటి క్రితం ఛజర్సీ టోల్ గేట్ వద్ద నా కారుపై కాల్పులు జరిపారు. 4 రౌండ్లు ఫైరింగ్ జరిగింది.

ముగ్గురు, నలుగురు ఉన్నారు. ఆయుధాలు అక్కడే వదిలేసి అందరూ పారిపోయారు. నా కారు పంక్చర్ అయింది.

వేరే కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాను. మేమంతా క్షేమంగా ఉన్నాం" అంటూ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"ఉత్తర్‌ప్రదేశ్‌లో మీరట్‌లోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమం తరువాత నేను దిల్లీకి బయలుదేరాను. ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో ఇద్దరు వ్యక్తులు నా వాహనంపై మూడు, నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. వాళ్లు ముగ్గురు, నలుగురు ఉన్నారు. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. అక్కడినుంచి మరొక వాహనంలో బయలుదేరాను" అని అసదుద్దీన్ తెలిపినట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అసదుద్దీన్ కారుపై కాల్పుల ఘటనపై పోలీసులు స్పందించారు.

ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని హపుర్‌ ఎస్పీ దీపక్ భుకేర్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. అతని నుంచి ఆయుధం స్వాధీనం చేసుకున్నాం. అతన్ని విచారిస్తున్నాం. ఆయనతో ఉన్న వారు పారిపోయారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం'' అని హపుర్‌ ఎస్పీ దీపక్ భుకేర్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

మరోవైపు కాల్పుల ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో లోక్‌సభ స్పీకర్‌ను కూడా కలుస్తానని ఆయన చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

అసలేం జరిగింది?

ఈ సంఘటన గురించి అసదుద్దీన్ స్థానిక మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

''నాతోపాటు నాలుగు వాహనాలున్నాయి. వీటిలో మా పార్టీ నేతలున్నారు. టోల్‌గేట్ దాటగానే పెద్ద సౌండ్ వచ్చింది. ఇటు చూస్తే ఇద్దరు వ్యక్తులు మాపై కాల్పులు జరుపుతున్నారు. వెనక వస్తున్న మా పార్టీ వాహనం డ్రైవర్ కాల్పులు జరుపుతున్న వ్యక్తిపై వాహనాన్ని పోనిచ్చాడు.

రెండో వ్యక్తి ఇంకా ఫోర్చునర్ వాహనంపై కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. మేం దిల్లీ వచ్చి అడిషనల్ ఎస్పీతో మాట్లాడాం. తాను స్పాట్‌లో ఉన్నానని, ఆయుధం దొరికిందని, కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా పట్టుకున్నామని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఎలక్షన్ కమిషన్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి నా డిమాండ్ ఒక్కటే. ఒక ఎంపీ మీద దాడి జరగడం మామూలు విషయం కాదు. దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలి. ఇది ప్లాన్ ప్రకారం జరిగింది. టోల్ గేట్ దగ్గర దాడి చేయడం చాలా సులభమని వాళ్లకు తెలుసు. అక్కడ వాహనాలు స్లోగా వెళతాయి. కాల్పులు జరపడం చాలా ఈజీ. అందుకే అక్కడ కాపుకాశారు.

దేవుడి దయవల్లా నాకు ఏమీ కాలేదు. ఈ దాడి ద్వారా హంతకులు ఈ దేశానికి, ఉత్తర్‌ప్రదేశ్‌కు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు. శాంతి భద్రతల మీద శ్రద్ధ ఉంటే, అది యోగి సర్కారైనా, మోడీ సర్కారైనా స్వతంత్ర విచారణ జరిపించాలి. దీనివెనక ఎవరున్నారో బైటపడాలి. వాళ్లు చిన్న వ్యక్తులు కారు.

ఇది ప్లాన్ ప్రకారం జరిగింది. నాపై దాడికి రెక్కీ నిర్వహించారు. టోల్‌గేట్ దగ్గర కాపు కాయడం పక్కాగా జరిగింది. ఎందుకంటే మా దగ్గర బులెట్ ప్రూఫ్ వాహనాలు లేవు. వాహనాలు అక్కడ స్లో అవుతాయి. కాబట్టి అక్కడ దాడి చేయడం సులభం అనుకున్నారు. ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరుపుతుందో లేదో చూద్దాం'' అని అసదుద్దీన్ స్థానిక మీడియాతో చెప్పారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)