హెచ్‌పీవీ: క్యాన్సర్‌కు కారణమయ్యే ఈ వైరస్‌పై పురుషులకూ అవగాహన అవసరమంటున్న బాధితుడు

ఫొటో సోర్స్, Anthony Perriam
- రచయిత, లెయిగ్ బూబైర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
ఈ కథనంలోని ఫోటోలు మిమ్మల్ని కలవర పరిచే అవకాశం ఉంది.
దవడ కింద ఏర్పడిన గడ్డ క్యాన్సర్‌గా తేలడంతో ఓ ఇద్దరు పిల్లల తండ్రి నాలుక కోల్పోయే దశకు చేరుకున్నారు.
గడ్డ ఏర్పడిన తరువాత ఆంథోనీ పెర్రియం మొదటి సారి డాక్టర్‌ను కలిశారు. కొన్ని వారాల్లోనే ఆయనకు తలలో, మెడ వద్ద క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమ వైరస్ (హెచ్‌పీవీ) సోకినట్లు నిర్ధరణ అయింది.
హెచ్‌పీవీ అనేది కొన్ని వైరస్ గ్రూపుల వల్ల వస్తుంది. ఇది చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చాలా మందికి పెద్దగా సమస్యలేమీ రావు అయితే కొన్ని రకాల వైరస్‌లు క్యాన్సర్‌కు లేదా జననేంద్రియాల వద్ద గుల్లలకు కారణం అవుతాయి.
"హెచ్‌పీవీకి సర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధం ఉందని నాకు తెలుసు. అయితే పురుషుల్లో ఇలాంటి క్యాన్సర్లు వస్తాయని నాకు తెలియదు" అని కార్డిఫ్‌కు చెందిన ఆంథోనీ చెప్పారు.

"నేను అదృష్టవంతుడిననుకుంటా. ఎందుకంటే నేనిప్పుడు మాట్లాడగలను, తినగలను. అయితే నేనింకా ఆలస్యం చేసి ఉంటే, నాలుక కోల్పోయేవాడిని లేదా చనిపోయేవాడిని " అని ఆంథోనీ అన్నారు.
హెప్‌పీవీ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపించవని బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ సోకినప్పుడు జననావయవాల వద్ద మొటిమల్లాంటి గుల్లలు కనిపిస్తాయి. కణాల్లో అసాధారణ మార్పుల వల్ల అవి క్యాన్సర్‌గా మారతాయి. ఇవి సాధారణంగా పురుషుల్లో తల, మెడ క్యాన్సర్‌కు, మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌కు కారణం అవుతాయి.

ఫొటో సోర్స్, Anthony Perriam
మెడలో 44 లింఫ్‌నోడ్లు
హెచ్‌పీవీ సోకే ప్రమాదం ఉన్న వారికి, 12 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని ఎన్‌హెచ్‌ఎస్ సూచిస్తోంది.
"మీకు ఏదైనా గడ్డ లేస్తే, అది నొప్పిగా లేకున్నప్పటికీ ఒక్కసారి పరీక్ష చేయించుకోండి" అని ఆయన చెప్పారు.
"ఈ తరహా క్యాన్సర్ల గురించి ఎక్కువగా మాట్లాడరు. ప్రత్యేకించి పురుషుల్లో ఈ చర్చ జరగదు. ముందుగా మేల్కొంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు" అని ఆంథోనీ అన్నారు.
ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ, 2003 మార్చ్‌లో సీటీ స్కాన్, బయాప్సీ, ఎంఆర్ఐ చేసినప్పుడు ఈ వ్యాధి సోకినట్లు తేలింది.
"నాకు మూడేళ్లు, ఆరేళ్ల పిల్లలున్నారు. నా ఆలోచనలు నా గురించి కాదు. వాళ్ల గురించే. వాళ్ల గురించి ఆలోచిస్తుంటే భయమేస్తోంది" అని 41 ఏళ్ల ఆంథోనీ అన్నారు.
ఆంథోనీ మెడ నుంచి 44 లింఫ్‌నోడ్లు తొలగించారు. రోబో సాయంతో చేసిన సర్జరీ ద్వారా నాలుక అడుగున ఉన్న పెద్ద కణితిని తొలగించారు.

ఫొటో సోర్స్, Anthony Perriam
22 కేజీల బరువు కోల్పోయిన ఆంథోనీ
"కణితిని సరైన సమయంలో పట్టుకున్నట్లు వాళ్లు నాతో చెప్పారు. లింఫ్‌నోడ్లలో ఒకటి చీలిపోయే దశకు చేరుకుంది. అది కాస్త కిందకు వెళ్లి ఉంటే మరింత వ్యాపించేది" " అని ఆంథోనీ వివరించారు
రేడియో థెరపీ, కీమో థెరపీ చాలా కష్టంగా ఉంటాయి. క్యాన్సర్ చికిత్స వల్ల ఆంథోనీ 22 కేజీల బరువు కోల్పోయారు.
"నా నోట్లో లాలాజలం లేకుండా పోయింది. నీళ్లు తాగడం కూడా కష్టంగా ఉంది. నా నోరంతా పౌడర్‌గా మారిపోయింది" అని ఆయన అన్నారు.
"నేను చాలా బలహీనంగా ఉన్నాను. చివరకు నాకు వీల్ చెయిర్ అవసరమైంది. కారిడార్‌లో వీల్ చెయిర్ చక్రాలు తిప్పుకుంటూ రేడియో థెరపీకి వెళ్లడం నా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. అయితే దీన్ని అధిగమించడానికి నా కుటుంబం నాకు సాయంగా నిలిచింది. నేను నా 40వ పుట్టిన రోజు చేసుకోవాలనుకుంటున్నాను" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Anthony Perriam
హెచ్‌పీవీ అంటే ఏంటి?
హెచ్‌పీవీ శరీరానికి సోకుకుంది. అందులోనూ 100కి పైగా రకాలు ఉన్నాయి.
ఇది జననేంద్రియాల వద్ద చర్మం నుంచి చర్మం కలవడం వల్ల, యోని, వెనుక నుంచి సెక్స్ చేయడం లేదా నోటి ద్వారా సెక్స్ చేయడం, వేరొకరు ఉపయోగించిన సెక్స్ టాయ్స్ ఉపయోగించడం వల్ల సోకుతుంది.
వేల్స్‌లో జాతీయ రోగ నిరోధక కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. 12-13 ఏళ్ల పిల్లల వయసులో పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ చేయిస్తే అది అత్యుత్తమంగా పని చేస్తుంది.
2008లో ఈ వ్యాక్సిన్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 20 ఏళ్లలోపు మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రేటు 90శాతం తగ్గినట్లు యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్ తెలిపింది.
పిల్లలు ఈ వ్యాక్సిన్ వేయించుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కార్డిఫ్ వేల్ హెల్త్ బోర్డులో హెడ్ అండ్ నెక్ సర్జన్ ఓటోలారిన్జోలజిస్టు సందీప్ బెర్రీ కోరారు.
"హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను కొన్నేళ్లుగా ప్రపంచం అంతటా ఉపయోగిస్తున్నారు. ఇది సురక్షితమైనది, ప్రభావవంతమైనది. వేల్స్ రోగనిరోధక కార్యక్రమంలో ఇదొక భాగం కూడా" అని ఆయన చెప్పారు.
"అబ్బాయిలు, అమ్మాయిలను ఇది సురక్షితంగా ఉంచుతుంది. హెచ్‌పీవీ సంబంధిత క్యాన్సర్ రాకుండా ప్రజా ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను ఎనిమిదో ఏట ఇస్తున్నారు. లైంగిక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఈ వ్యాక్సిన్ రోగ నిరోధక వ్యవస్థ బలంగా స్పందించేలా చేస్తుంది" అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














