వైల్డ్‌‌‌లైఫ్ ఫోటోగ్రఫీ: విజేతలుగా నిలిచిన కొన్ని ఫోటోలు ఇవే, చూశారా?

 ఆహారాన్ని వేటాడుతున్నఈ లింక్స్ ఫోటో అందరి మనసులను గెలిచి విజేతగా నిలిచింది. దీన్ని ఆస్ట్రియాకు చెందిన జోసఫ్ స్టెఫాన్ తీసారు.

ఫొటో సోర్స్, Josef Stefan / Wildlife Photographer of the Year

ఫొటో క్యాప్షన్, ఆహారాన్ని వేటాడుతున్నఈ లింక్స్ ఫోటో అందరి మనసులను గెలిచి విజేతగా నిలిచింది.
చదివే సమయం: 4 నిమిషాలు

వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీలో ప్రతిష్టాత్మకమైన "వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డ్ 2026"ను ఒక ఐబీరియన్ లింక్స్ వేటలో నిమగ్నమై ఉన్న అద్భుత దృశ్యాన్ని చూపించిన ఫోటో గెలుచుకుంది.

"ఫ్లయింగ్ రోడెంట్" అనే ఈ చిత్రాన్ని ఆస్ట్రియన్ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ స్టెఫాన్ స్పెయిన్‌లోని టోర్ డే హుయాన్ అబాద్ ప్రాంతంలో రెండు వారాల పర్యటన సందర్భంగా చిత్రీకరించారు.

ఆ లింక్స్ తన వేటను నోట పట్టుకుని జోసెఫ్‌కు కనిపించింది. ఆ తర్వాత అది ఆ జంతువును గాల్లోకి విసురుతూ, ఎగరేస్తూ, పట్టుకుంటూ ఆడుకుంటున్న క్షణాలను ఆయన కెమెరాలో బంధించారు.

ఈ ఏడాది అవార్డుకు నామినేట్ అయిన మిగతా 24 చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ అభిమానుల నుండి రికార్డు స్థాయిలో 85,917 ఓట్లు సాధించాయి.

విజేతగా నిలిచిన ఫోటోతో పాటు మరో నాలుగు ఫైనలిస్టు చిత్రాలు కూడా ప్రత్యేక ప్రశంసలు పొందాయి.

ఈ ఐదు చిత్రాలను ఆన్‌లైన్‌లో పాటు లండన్‌లోని నేచురల్ హిస్టరీ ఆఫ్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టనున్నారు. ఇది జూలై 12 వరకు కొనసాగనుంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోలార్ బేర్స్, ధృవపు ఎలుగుబంట్లు

ఫొటో సోర్స్, Christopher Paetkau / Wildlife Photographer of the Year

ఫొటో క్యాప్షన్, మార్గంమధ్యలో ఇలా తల్లి మీద ఒరిగిపోయి నిద్రలోకి జారుకున్న పోలార్ బేర్లు

తల్లి పోలార్ బేర్, దాని ముగ్గురు పిల్లలు దూర ప్రయాణాలు చేసి హడ్సన్ బేలో ఇలా కునుకు తీస్తూ క్రిస్టోఫర్ పాయిట్కౌ కెమెరాకు చిక్కాయి.

కరిగిపోతున్న మంచు కారణంగా ఈ ధృవపు ఎలుగుబంట్లకు వేట చాలా కష్టంగా మారింది. కానీ, స్వాల్‌బార్డ్‌లో పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నమీబియా ఫ్లెమింగో

ఫొటో సోర్స్, Alexandre Brisson/Wildlife Photographer of the Year

నమీబియాలోని వాల్విస్ బేలోని ఒక అభయారణ్యంలో సూర్యాస్తమయం అవుతుండగా పవర్ లైన్ల వద్ద గుమిగూడిన ఫ్లెమింగోల ఫోటో ఇది.

ఈ గుంపులోంచి రెండు పక్షులు ఒక్కసారిగా ఎగరగానే కన్నులవిందు చేసే దృశ్యం ఆవిష్కృతమైంది.

కెనడాలోని జాస్పర్ నేషనల్ పార్కులో రోడ్డు మధ్యలో రెండు బంటి పిల్లలు అల్లరి చేస్తూ కనపడ్డాయి.

ఫొటో సోర్స్, Will Nicholls/Wildlife Photographer of the Year

కెనడాలోని జాస్పర్ నేషనల్ పార్కులో రోడ్డు మధ్యలో రెండు ఎలుగుబంటి పిల్లలు అల్లరి చేస్తూ కనపడ్డాయి.

సాధారణంగా తల్లి ఎలుగు ఇలాంటి చిన్న పిల్లలను ఎవరికీ కనబడనీయదు. కానీ, ఇవి అల్లరి చేస్తూ రోడ్డు మీదకు వచ్చాయి.

ఒడిశాలోని సిమిలిలపాల్ టైగర్ రిసర్వ్‌లో అరుదైన దట్టమైన చారలతో కనిపించిన ఈ పులి పేరు T12.

ఫొటో సోర్స్, Prasenjeet Yadav/Wildlife Photographer of the Year

ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో తిరుగుతున్న పులి ఇది. దీనికి పులులలో చాలా అరుదుగా కనిపించే దట్టమైన చారలు దీనికి ఉన్నాయి. దీనిపేరు టీ 12.

గతంలో ఈ అడవిలో ఇది ఒకే ఒక్క మగ పులి. అయితే, ఇప్పుడు దీని సంతానం కూడా ఈ అడవిలో ఉంది.

పశ్చిమ కనుమలు, మకాక్

ఫొటో సోర్స్, Lalith Ekanayake/Wildlife Photographer of the Year

భారత్‌లోని పశ్చిమ కనుమల్లో బిడ్డను ఎత్తుకుని పరుగెత్తుతూ కనిపించిన లయన్-టెయిల్డ్ మకాక్ కోతి ఇది. వీటిని లలిత్ ఏకనాయకే తన కెమరాలో బంధించారు.

తమ ఆవాసాల్లోకి మనుషులు చొచ్చుకు వస్తుండటంతో ఈ జంతువులు చిన్న చిన్న గుంపులుగా బతకడం ప్రారంభించాయి.

నోట్లో గుడ్లను పట్టకేళుతున్న సాలె పురుగు

ఫొటో సోర్స్, Thomas Hunt / Wildlife Photographer of the Year

ఫొటో క్యాప్షన్, నోటితో గుడ్లను పట్టకెళుతున్న సాలె పురుగు

కెమెరామెన్ థామస్, సౌథాంప్టన్‌లోని తన సోదరి రూమ్‌లో ఉండగా ఆయనకొక అపురూప దృశ్యం కనబడింది.

నోటితో తన గుడ్లను మోసుకెళుతున్న సెల్లార్ స్ప్రైడర్‌ను ఆయన తన కెమెరాలో బంధించారు. తర్వాత ఆ సాలీడును గుడ్లతో సహా జాగ్రత్తగా తీసుకెళ్లి తన గరాజ్‌లో పెట్టారు.

పెరూ

ఫొటో సోర్స్, Dustin Chen/Wildlife Photographer of the Year

పెరూలోని హ్వెంబో లాడ్జిలో ఈ అద్భుతమైన స్పాచ్యులిటెయిల్ జాతికి చెందిన హమ్మింగ్ బర్డ్ తన రెక్కలనాడిస్తూ పూలలో మకరందాన్ని ఆస్వాదించే ప్రయత్నాన్ని కెమెరామెన్ తన కెమెరాలో బంధించారు.

అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఇది కూడా ఒకటి. డస్టిన్ చెన్ దీన్ని ఫోటో తీశారు.

థాయ్‌లాండ్‌లోని బురి రామ్ ప్రాంత పంటల్లో వారం రోజులు తిరిగిన తన పిల్లను శుభ్రం చేస్తూ ఈ సారస్ క్రేన్లు కెమరాకు చిక్కాయి

ఫొటో సోర్స్, Ponlawat Thaipinnarong/Wildlife Photographer of the Year

థాయ్‌లాండ్‌లోని బురి రామ్ ప్రాంత పంటల్లో వారం రోజులు తిరిగిన తన పిల్లను శుభ్రం చేస్తూ ఈ సారస్ క్రేన్లు కెమరాకు చిక్కాయి.

పొన్లావట్ థాయ్‌పిన్నరాంగ్ ఈ ఫోటోను తీశారు.

టాస్మేనియాలో కోల్స్ అనే పశువులను ఫోటో తీసేందుకు అమర్చిన కెమరాలో చిక్కాయి ఈ తల్లి జోయీ, పిల్ల జోయీ. తల్లిని అనుకరిస్తున్న ఈ పిల్ల జోయీ చేష్టలు అలరించాయి.

ఫొటో సోర్స్, Charles Davis/Wildlife Photographer of the Year

టాస్మేనియాలో కోల్స్ అనే పశువులను ఫోటో తీసేందుకు అమర్చిన కెమరాలో చిక్కాయి ఈ తల్లి జోయీ, పిల్ల జోయీ. తల్లిని అనుకరిస్తున్న ఈ పిల్ల జోయీ చేష్టలు అలరించాయి.

చార్లెస్ డెవిస్ ఈ ఫోటో తీశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)