#Abhinandan: వింగ్ కమాండర్ అభినందన్‌కు ‘వైద్య పరీక్షలు చాలా అవసరం’

ఫొటో సోర్స్, dd news
చదివే సమయం: 3 నిమిషాలు
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ స్వదేశంలో అడుగుపెట్టారు.
వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ భారత్‌కు అప్పగించింది.
పాక్ వాఘా సరిహద్దులో అధికారులు లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత, అభినందన్ భారత వాఘా సరిహద్దులోకి ప్రవేశించారు.
భారత్‌లోకి అడుగుపెట్టిన వింగ్ కమాండర్ అభినందన్‌కు భారత సైనిక అధికారులు, వైమానికదళ అధికారులు స్వాగతం పలికారు.
ప్రొటోకాల్ ప్రకారం అభినందన్‌ను మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లారు.
- అభినందన్ భారత్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ మీడియాతో మాట్లాడారు.
- "అభినందన్ తిరిగి మన మధ్యకు తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది"-ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్

ఫొటో సోర్స్, PTV
- పాక్ నుంచి స్వదేశంలోకి అడుగుపెట్టిన అభినందన్‌కు పూర్తిస్థాయి మెడికల్ చెకప్ చేసిన తర్వాత ఆయనను దిల్లీ తీసుకెళ్తామని తెలిపారు.
- "ఎందుకంటే ఆఫీసర్ విమానం నుంచి ఎజెక్ట్ అయ్యాడు. అందుకే ఆయన శరీరం చాలా ఒత్తిడికి గురై ఉన్నట్టు కనిపిస్తోంది" అని తెలిపారు..
- అభినందన్‌కు ఇప్పుడు వైద్య పరీక్షలు చాలా అవసరం అని అధికారులు చెప్పారు.
- "ఆయన స్వదేశానికి తిరిగి రావడంపై వైమానిక దళం సంతోషం వ్యక్తం చేస్తోంది" అని ఆర్జీకే కపూర్ చెప్పారు.
- "ఎందుకు ఆలస్యం అయ్యిందని మేం పాకిస్తాన్ అధికారులను అడగలేదు" అని మరో ఆర్మీ అధికారి తెలిపారు..
- "తిరిగి స్వదేశానికి చేరుకోవడంపై అభినందన్ చాలా సంతోషంగా ఉన్నారు" అన్నారు.
- మెడికల్ చెకప్ తర్వాత ఆయన్ను తిరిగి హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తాం అని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, PTV
- భారత కాలమానం ప్రకారం రాత్రి 9.20 నిమిషాలకు పాకిస్తాన్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించింది.
- అభినందన్‌తోపాటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఫారోహా బుట్టీ కూడా వాఘా సరిహద్దు దగ్గరకు వచ్చారు. ఆయనను భారత అధికారులకు అప్పగించారు.
- అంతకు ముందు పాకిస్తాన్ మీడియా వింగ్ కమాండర్ అభినందన్‌కు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది.
- ఆ వీడియోలో అభినందన్ పాకిస్తాన్ సైన్యం తనతో ప్రొఫెషనల్‌గా వ్యవహరించిందని, తనను స్థానికుల నుంచి కాపాడి ఆర్మీ క్యాంప్‌కు తీసుకెళ్లిందని చెప్పారు.
- పాక్ ఆర్మీ క్యాంప్‌లో తనకు ప్రథమ చికిత్స అందించారని కూడా అభినందన్ తెలిపారు.
అంతకు ముందు...
- పాక్ అధికారులు అభినందన్‌ను ఎయిర్ అటాచీ టు పాకిస్తాన్ జేడీ కురియన్‌కు అప్పగించినట్లు రాజ్యసభ టీవీ వెల్లడించింది.
- అభినందన్‌ను ఫిబ్రవరి 27న పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది.
- పాక్ దళాల ఫైరింగ్‌లో విమానం కూలిపోయిన తర్వాత అభినందన్ ప్యారాచూట్ సాయంతో పాకిస్తాన్ ప్రాంతంలో కిందికి దిగారు.
- మూడు రోజుల పాటు అభినందన్ పాక్ దళాల అదుపులో ఉన్నారు.
- అభినందన్ పాక్ దళాలకు చిక్కిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆయన్ను తిరిగి భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించారు.
పోస్ట్ Facebook స్కిప్ చేయండి
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
- బీఎస్‌ఎఫ్‌కు సంబంధించిన అధికారులు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు వైమానిక సీనియర్ అధికారులు వాఘా-అటారీ సరిహద్దు దగ్గర చేరుకున్నారు.
- పాకిస్తాన్ వాఘా బోర్డర్ దగ్గరకు పాక్ ఆర్మీ వాహనాల కాన్వాయ్ చేరుకుంది. వీటిలో చాలా వాహనాలు ఉన్నాయి. వింగ్ కమాండర్ అభినందన్‌ను ఈ వాహనాల్లోనే తీసుకొస్తున్నారని భావించారు.
- తమిళనాడు కన్యాకుమారీలో ఒక ర్యాలీలో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి భారతీయుడూ తమిళనాడు వాసి అయిన వింగ్ కమాండర్ అభినందన్‌ను చూసి గర్వించాలని అన్నారు.
- వాఘా-అటారీ సరిహద్దు దగ్గర శుక్రవారం సాయంత్రం జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం రద్దు చేశారు. భారత పారామిలిటరీ బలగాలు, బీఎస్ఎఫ్ ఈరోజు జరిగే కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్టు అమృత్‌సర్ డీసీ శివదులార్ సింగ్ దిల్లో తెలిపారు.
సరిహద్దుల్లో అభినందన్‌కు స్వాగత ఏర్పాట్లు






ఇవి కూడా చదవండి.
- అభినందన్: విమానం నుంచి పడగానే ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షి కథనం - BBC EXCLUSIVE
- అభినందన్‌ను భారత్‌లోకి ఎలా తీసుకొస్తారు? విధి, విధానాలు ఏమిటి?
- అభినందన్‌ను పాకిస్తాన్ ఎందుకు విడుదల చేస్తోంది? ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం వెనుక కారణాలేంటి?
- యుద్ధం వస్తే తెరపైకి అణు బాంబులు వస్తాయి : అభిప్రాయం
- ట్రంప్-కిమ్ సమావేశం ఎందుకు విఫలమైంది?
- విశాఖ రైల్వేజోన్: కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అసంతృప్తి ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




