You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సురేశ్ రైనా అత్తమామలపై దాడి.. ఐపీఎల్ నుంచి వైదొలగడానికి కారణం ఇదేనా?
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడటానికి యూఏఈ చేరుకున్న సురేశ్ రైనా ఈ సీజన్‌కు ఆడటం లేదని, ఆయన తిరిగి స్వదేశం చేరుకుంటున్నారని ఆ టీమ్ తన ట్విటర్ హ్యాండిల్‌లో పేర్కొంది.
రైనా కుటుంబానికి చెన్నై సూపర్‌కింగ్స్ పూర్తి సహకారం అందిస్తుందని టీవీ సీఈఓ కె.సి విశ్వనాథన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
రైనా భారతదేశానికి తిరిగి రావడానికి గల కారణాల గురించి మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.
బంధువుల ఇంట్లో విషాదమే కారణమా?
సురేశ్ రైనా సమీప బంధువుల ఇంట్లో నెలకొన్న విషాదమే అతను తిరిగి రావడానికి కారణమని చెబుతున్నారు. ఆగస్టు 19 రాత్రి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో అతని అత్తమామల ఇంటిని దుండగులు దోచుకోడానికి ప్రయత్నించారు.
రైనా అత్తమామలను దొంగలు పదునైన ఆయుధంతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో రైనా మామ 58ఏళ్ల తారాల్ అదే రాత్రి మరణించగా, అత్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. “రైనాకు విషయం తెలియజేశాం. ఆయన తిరిగి వస్తున్నారు’’ అని ఆయన సమీప బంధువు శ్యామ్‌లాల్ వెల్లడించారు.
“ఈ సంఘటన జరిగి 11 రోజులు అయ్యింది. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు. రైనా అత్త ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్సకు చాలా ఖర్చవుతోంది. ప్రభుత్వం సాయం చేయాలి. గ్రామస్తులు కొంత సాయం చేశారు. కానీ వారు మాత్రం ఎన్నాళ్లు చేయగలరు? అధికారులే వారిని ఆదుకోవాలి" అని ఆయన అన్నారు.
కేసును దర్యాప్తు చేస్తున్నామని పఠాన్‌కోట్ ఎస్పీ ప్రభుజోత్ సింగ్ చెప్పారు.
రైనా తిరిగి రావడంపై స్పందనలు
రైనా ఐపీఎల్ నుంచి తిరిగి రావడంపై అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తూనే అతని కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. కుటుంబలో జరిగిన విషాదం వల్ల ఆయన తిరిగి వస్తున్నాడని, వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కొందరు ట్వీట్ చేశారు.
రైనా ఐపీఎల్‌లో ఆడలేకపోవడం దురదృష్టకరమని కొందరు వ్యాఖ్యానించారు. అభిమానులంతా ఆయన వెంట ఉన్నారని, ఆయన కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నామని కొందరు రాశారు.
“చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచారు. ఇప్పుడు రైనా తిరిగి వస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమో’’ అంటూ మరికొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మధ్యే రిటైర్మెంట్
ఇటీవల మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోజే సురేశ్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. 13 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో రైనా 18 టెస్ట్ మ్యాచ్‌లు, 226 వన్డేలు, 78 టీ-20 మ్యాచ్‌లు ఆడారు రైనా. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 193 మ్యాచ్‌లు ఆడారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
- ‘వాట్సాప్-బీజేపీ చేతులు కలిపాయి’.. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ
- జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం
- 7 నుంచి మెట్రో రైళ్లు నడుస్తాయి.. సినిమా హాళ్లు తెరవడానికి వీల్లేదు
- పంది మెదడులో కంప్యూటర్ చిప్.. ఎలాన్ మస్క్ సంస్థ ప్రయోగం - BBC Newsreel
- భార్యనో, భర్తనో, లవర్‌నో వదిలించుకోవాలనుకుంటే ఈ ఏజెంట్లు రంగంలోకి దిగుతారు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)