కేంద్ర బడ్జెట్ : ఎస్‌టీటీలపై సీతారామన్ ఏం ప్రకటించారు, స్టాక్‌మార్కెట్ ఎందుకు పతనమైంది?

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ సందర్భంగా చేసిన ప్రసంగానికి స్టాక్ మార్కెట్ ప్రతికూలంగా స్పందించింది. ఆర్థిక మంత్రి ప్రసంగం ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్ గణనీయమైన క్షీణతను నమోదు చేసింది. సెన్సెక్స్ ఒక దశలో 2300 పాయింట్లు పడిపోయింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో షేర్లు ఒక రోజులో 19.18 శాతం నష్టపోయాయి. కోవిడ్ తర్వాత ఎంసీఎక్స్ మార్కెట్‌లో ఈ స్థాయి పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి. స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంచుతున్నట్లు ప్రకటించడం వల్లే మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయని నిపుణులు భావిస్తున్నారు.
ఆదివారం స్టాక్ మార్కెట్ తెరిచి ఉంచటం చాలా అరుదు. అయితే బడ్జెట్ ప్రవేశ పెడుతూ ఉండటంతో మార్కెట్‌లో ట్రేడింగ్ జరిగింది.

ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్‌ను 0.02 శాతం నుండి 0.05 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
దీంతో స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాలు కనిపించాయి.
"సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను" వాటాల కొనుగోలు, అమ్మకాలపై ఈ పన్ను విధిస్తారు.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్‌ను రెట్టింపు కంటే ఎక్కువ చేయాలనే ప్రతిపాదన ఉందని ఆర్థిక మంత్రి అన్నారు.
ఫ్యూచర్ అండ్ ఆప్షన్‌లపై ప్రస్తుతం ఎస్‌టీటీ 0.02%గా ఉంది. ఇప్పుడు దానిని 0.05%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది
ఆర్థిక మార్కెట్లలో ఆదాయాన్ని పెంచడానికి, స్థిరత్వాన్ని పెంచడానికి షేర్ల లావాదేవీలపై ఈ పన్నును విధిస్తున్నారు.
ఇది పూర్తిగా విలువ ఆధారితమైనది. అంటే కొనుగోలు చేసిన లేదా అమ్మిన షేర్ల విలువ ఎక్కువగా ఉంటే కొనుగోలు చేసిన లేదా అమ్మిన వ్యక్తి లాభపడ్డాడా లేదా నష్టపోయాడా అనే దానితో సంబంధం లేకుండా ఎస్‌టీటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది.
మార్కెట్‌లో స్పెక్యులేషన్‌ను తగ్గించేందుకు ఎస్‌టీటీని 2004 అక్టోబర్ 1న ప్రవేశ పెట్టారు. షేర్ల లావాదేవీల సమయంలోనే లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈ పన్నును వసూలు చేస్తారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే ఎస్‌టీటీ పెంపు కేవలం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కే వర్తిస్తుందని ఆదాయపు పన్ను శాఖ ఎక్స్‌లో తెలిపింది.అంచనాల ఆధారంగా జరిగే ట్రేడింగ్‌ను నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు అని తెలిపింది.

ఫొటో సోర్స్, SANSAD TV
ఆరెంజ్ ఎకానమీ
"భారతదేశంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కామిక్స్ రంగం అభివృద్ధి చెందుతోంది. దీనికి 2030 నాటికి 20 లక్షల మంది నిపుణులు అవసరం" అని ఆర్థిక మంత్రి అన్నారు.
15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలలలో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంలో ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్‌కు సహాయం చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
ఆరెంజ్ ఎకానమీ, లేదా క్రియేటివ్ ఎకానమీ అనేది సృజనాత్మకత, నైపుణ్యాలు, మేధో సంపత్తిపై ఆధారపడిన రంగాలను సూచిస్తుంది. వీటిలో కళ, డిజైన్, ఫ్యాషన్, సినిమా, సంగీతం, డిజిటల్ కంటెంట్ ఉన్నాయి.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రకటించారు.
ఆదాయ పన్ను నియమాలను మరింత సరళీకరించి, త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు.
ఆదాయ పన్ను ఫారమ్‌లను సరళీకరించనున్నట్లు చెప్పారు. నామమాత్రపు రుసుముతో రివైజ్డ్ రిటర్న్‌లను మార్చి 31 వరకు దాఖలు చేయవచ్చన్నారు.
ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు సంబంధించిన కాలపరిమితి, నియమాలలో మార్పులు చేశామని ఆర్థిక మంత్రి అన్నారు. ఇక నుంచి, ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసేవారు జులై 31 వరకు రిటర్న్‌లను దాఖలు చేయవచ్చన్నారు. అయితే, ఈసారి ఆదాయపు పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పులూ లేవు.
వాస్తవానికి, గత సంవత్సరం ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ప్రకారం, రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. జీతభత్యాలకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000, కాబట్టి మొత్తంగా రూ. 12,75,000 వరకు పన్ను ఉండదు.

ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ లావాదేవీ పన్ను (ఎస్‌టీటీ) పెంపును ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై ఎస్‌టీటీని 0.05 శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
"భారతదేశంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. దీనికి 2030 నాటికి 20 లక్షల మంది నిపుణులు అవసరం" అని ఆర్థిక మంత్రి అన్నారు.
15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంలో ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్‌కు సాయం చేసేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు.

ఫొటో సోర్స్, ANI
రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక కారిడార్
ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కారిడార్‌కు 'రేర్ ఎర్త్ మాగ్నెట్ కారిడార్' అని పేరు పెట్టనున్నట్లు చెప్పారు.
ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీకి రూ. 40,000 కోట్లు ప్రతిపాదించారు.

బడ్జెట్‌లో మరికొన్ని ప్రతిపాదనలు
- ఎస్ఎంఈ రంగానికి 10,000 కోట్ల వృద్ధి నిధి
- సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ. 2,000 కోట్లు
- 7 హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి ఆమె కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
పారిశ్రామిక వృద్ధిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, గత ఏడాది ఆగస్టు 15 నుంచి 350కి పైగా ఆర్థిక సంస్కరణలు అమలు చేశామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ, "ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, నిలబెట్టడానికి ఆరు రంగాలలో సంస్కరణలను ప్రతిపాదిస్తున్నాను - ఏడు వ్యూహాత్మక రంగాలలో తయారీని పెంచడం, పాత పారిశ్రామిక ప్రాంతాలను పునరుజ్జీవింపజేయడం, చాంపియన్ ఎంఎస్ఎంఈలను సృష్టించడం, మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం, దీర్ఘకాలిక భద్రత, స్థిరత్వాన్ని నిర్ధరించడం, పట్టణ ఆర్థిక మండలాలను అభివృద్ధి చేయడం" అన్నారు.

ఫొటో సోర్స్, ANI
‘‘పదకొండేళ్లుగా ప్రధాని నాయకత్వంలో సమర్పించిన బడ్జెట్లకు దేశ ప్రజల ఆకాంక్షలే ఆధారం. ఈ బడ్జెట్లు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాయి. ఇవాళ్టి బడ్జెట్ 2047నాటి అభివృద్ధి చెందిన భారత్‌ను దృష్టిలో ఉంచుకుంటుంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధురి అన్నారు.
దివంగత ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్‌ల రికార్డుకు ఆమె అతిచేరువలో ఉన్నారు. అయితే, మొరార్జీ దేశాయ్ పది బడ్జెట్‌లను వరుసగా ప్రవేశపెట్టలేదు. వివిధ పదవీకాలాల్లో ఆయన బడ్జెట్‌లు సమర్పించారు. నిర్మలా సీతారామన్ మాత్రం వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














