ఐపీఎల్ 19వ సీజన్: ఏ జట్టులో ఏయే ఆటగాళ్లు ఉన్నారు? ఏఏ మ్యాచ్‌లు ఎక్కడెక్కడ?

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images
ఐపీఎల్19వ సీజన్ మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కానుంది. ప్రస్తుత ఛాంపియన్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు హోమ్ గ్రౌండ్‌లోనే ఈ సీజన్ మొదటి మ్యాచ్ జరగనుంది.
ఈ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్‌సీబీ తలపడనుంది.
ఈసారి కూడా ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ 13 నగరాల్లో నిర్వహించనున్నారు.
దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లు తమ హోమ్ మ్యాచ్‌లను వరుసగా దిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబయి నగరాల్లో ఆడనున్నాయి.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ ఏడు హోమ్ మ్యాచ్‌లలో నాలుగు జైపుర్‌లో, మూడు గువహటిలో ఆడుతుంది.
పంజాబ్ కింగ్స్ తమ నాలుగు హోమ్ మ్యాచ్‌లను న్యూచండీగఢ్‌లో, మిగిలిన మూడింటిని ధర్మశాలలో ఆడుతుంది.
వీటితో పాటు, ఆర్‌సీబీ తన ఐదు హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులో, రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడుతుంది.
ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ రౌండ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత ప్లే-ఆఫ్ రౌండ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, ఫైనల్ మ్యాచ్ ఉంటాయి.
ప్రతి జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. వాటిలో 7 మ్యాచ్‌లు తమ సొంత మైదానంలో, మిగిలిన 7 మ్యాచ్‌లు ప్రత్యర్థి జట్టు మైదానంలోనూ ఆడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Photo by Pankaj Nangia/Getty Images
మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్
నాలుగు రాష్ట్రాలతో పాటు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఈ ఐపీఎల్ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నందున, ఎన్నికలకు ముందు కేవలం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేశారు.
బీసీసీఐ తర్వాత పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏ జట్టులో ఏయే ఆటగాళ్లు ఉన్నారు?
(ఇది మార్చి 18 నాటికి ఉన్న అధికారిక జాబితా)
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే):
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ, సంజు శాంసన్, డేవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, అన్షుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాకరీ గ్లెన్ ఫాల్క్స్, శివమ్ దుబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, గుర్జబ్నీత్ సింగ్, అఖీల్ హుస్సేన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్.
దిల్లీ క్యాపిటల్స్ (డీసీ):
కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఆకిబ్ దార్, నితీష్ రాణా, మిచెల్ స్టార్క్, టి.నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగీ ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్.
గుజరాత్ టైటాన్స్ (జీటీ):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, కుమార్ కుశాగ్ర, అనుజ్ రావత్, టామ్ బాంటన్, గ్లెన్ ఫిలిప్స్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, ఆర్.సాయికిషోర్, జయంత్ యాదవ్, జేసన్ హోల్డర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, అశోక్ శర్మ, పృథ్వీ రాజ్, ల్యూక్ వుడ్, రషీద్ ఖాన్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్):
అజింక్యా రహానే (కెప్టెన్), రింకూ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, కామెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, రోమన్ పావెల్, అనుకూల్ రాయ్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, రమన్‌దీప్ సింగ్, బ్లెస్సింగ్ ముజరబానీ, వైభవ్ అరోరా, పతిరానా, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ):
రిషబ్ పంత్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రెట్స్కీ, ముకుల్ చౌదరి, అక్షత్ రఘువంశీ, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కుల్కర్ణి, వానిందు హసరంగ, ఆయుష్ బదోని, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, సిద్ధార్థ్ మణిమారన్, దిగ్వేష్ రాఠీ, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, అన్రిచ్ నోర్ట్జే, నమన్ తివారీ, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.

ఫొటో సోర్స్, Debarchan Chatterjee/NurPhoto via Getty Images)
ముంబయి ఇండియన్స్ (ఎంఐ):
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మింజ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్, డానిష్ మలేవార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ అంగద్ భవా, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అశ్విని కుమార్, రఘుశర్మ, మహమ్మద్ ఇజార్, అల్లా మహమ్మద్ గజన్‌ఫర్, జస్ప్రీత్ బుమ్రా.
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నెహల్ వధేరా, విష్ణు వినోద్, హర్నూర్ పన్నూ, పాయల అవినాష్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, షాశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ప్రియాన్ష్ ఆర్య, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్ షెడ్గే, మిచ్ ఓవెన్, కూపర్ కానోలీ, బెన్ ద్వార్షుయిస్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్, లోకీ ఫెర్గూసన్.
రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్):
రియాన్ పరాగ్ (కెప్టెన్), శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, డోనావన్ ఫెరీరా, రవి సింగ్, అమన్ రావు, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, యుద్ధవీర్ సింగ్ చరక్, రవీంద్ర జడేజా, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, క్వేనా మఫాకా, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యశ్ రాజ్ పుంజా, విగ్నేష్ పుత్తూర్, బ్రిజేష్ శర్మ, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, నాండ్రే బర్గర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ):
రజత్ పటీదార్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోర్దాన్ కాక్స్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, వెంకటేష్ అయ్యర్, సాత్విక్ దేశ్వాల్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్ చౌహాన్, జోష్ హేజిల్ వుడ్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, యశ్ దయాల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్):
ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, సలిల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివాంగ్ కుమార్, క్రేన్స్ ఫులేత్రా, లియామ్ లివింగ్‌స్టన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనాద్కత్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.
గాయం కారణంగా ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని, ఆయన స్థానంలో ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహిస్తారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP via Getty Image
ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న జట్లు...
- 2008 : రాజస్థాన్ రాయల్స్
- 2009 : డెక్కన్ ఛార్జర్స్
- 2010 : చెన్నై సూపర్ కింగ్స్
- 2011 : చెన్నై సూపర్ కింగ్స్
- 2012 : కోల్‌కతా నైట్ రైడర్స్
- 2013 : ముంబయి ఇండియన్స్
- 2014 : కోల్‌కతా నైట్ రైడర్స్
- 2015 : ముంబయి ఇండియన్స్
- 2016 : సన్‌రైజర్స్ హైదరాబాద్
- 2017 : ముంబయి ఇండియన్స్
- 2018 : చెన్నై సూపర్ కింగ్స్
- 2019 : ముంబయి ఇండియన్స్
- 2020 : ముంబయి ఇండియన్స్
- 2021 : చెన్నై సూపర్ కింగ్స్
- 2022 : గుజరాత్ టైటాన్స్
- 2023 : చెన్నై సూపర్ కింగ్స్
- 2024 : కోల్‌కతా నైట్ రైడర్స్
- 2025 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























